నిన్నటి దాక నువ్వున్నావు..
మొన్న కూడా నువ్వున్నావు...
ఒక్క క్షణం నిన్ను నన్ను దూరం చేసింది...
సూర్యుడు నేడు ఉదయించాడు...
చంద్రుడు వెన్నెల కురిపించాడు...
నువ్వు మాత్రం జ్ఞాపకం అయిపోయావు...
అనుకోలేదు ఎప్పుడుకూడా...
కలగనలేదు ఎన్నడు నేను...
నువ్వు లేని రోజు కూడా ఒకటుందని..
నువ్వు లేవని నిజం నన్ను వెక్కిరిస్తుంటే...
నువ్వు లేని జీవితం నిజమవుతుంటే...
బ్రతకడం అలవాటయి నిన్ను కలగా చేస్తుంటే..
ఎక్కడున్నావో...ఏం చేస్తున్నావో...
నిన్ను చేరే క్షణ మోస్తుందని...
నాకు కూడా మోక్షం ఉందని...
ఆ క్షణం చేరేదానికి నా చూపులు....
నన్ను నీలో ఐక్యం చేసి...
జీవితానికి అర్ధం చూపు...
కొత్త జీవితం లో నువ్వు మార్గం అవుతావని...
ఒక ఆశ...ఒక ఎదురుచూపు...