Sunday, March 8, 2009

నేటి రాజకీయం...

స్థిరత్వం ఇస్తామని ప్రమాణాలు చేసే నాయకులకు...

స్థిరత్వానికి అర్థం తెలియదు...

ఈ రోజు ఇక్కడ... మరో రోజు అక్కడ...

స్వార్ధానికి మరోపేరు రాజకీయమైనప్పుడు...

మోసానికి మారుపేరు రాజనీతి అయినప్పుడు...

రాజకీయ కుప్పిగంతులకు అంతముండదు...

స్నేహుతులుందరు.....శత్రువులు ఉండరు...

కుర్చీ నే స్నేహితుడు....అధికారం బంధువు...

అధికారం ఎక్కడుంటే ఆ రంగులు మార్చే ఊసరవెల్లులు...

ప్రజా సమస్యలకు సమయముండదు....

పొత్తులకే సమయం అంతా ఉంటుంది...

ఈ రోజు మిత్రుడు అవుతాడు రేపు ప్రత్యర్ధి...

లేదు ఎలాంటి నీతి....లేదు నియమం...

ఉన్నదొక్కటే అధికార దాహం....

ఎన్నికలొస్తే ప్రజలే దేవుళ్ళు...

ఎన్నికైతే ఆ ప్రజలకే పంగనామాలు...

ఇక ఐదేళ్ళు కాంట్రాక్ట్లు...వ్యాపారాలు..

సంపాదన లో రాజకీయ గుంటనక్కలు

మారుస్తారు పార్టీలు తమ స్వార్ధానికి

చట్టసభ లో విలువైన సమయం నిద్రకే అంకితం...

ఐదేళ్ళకొకసారి గుర్తొస్తాయి ప్రజల వెతలు.....

ఇదే ఈనాటి రాజకీయం...

ఇదే ఈనాటి నాయకుల నైజం....

Saturday, March 7, 2009

అంధ ఘోష....

అమ్మ... ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా

నాన్నా........ అందాలను ఎందుకు చూడలేను నాన్నా...

లోకమెంతో అందంగా ఉంటుందని...

అవి చూసేందుకు రెండుకళ్ళు చాలవని

చెప్తుంటే విని కుమిలి కుమిలి ఏడ్చాను...

అందమైన హిమవన్నగాలు... అమరమైన గంగా పరవళ్ళు...

వెన్నెల రాత్రులు...స్వచ్చమైన మల్లెల అందం...

శ్రీ వేంకటేశ్వరుని అమర రూపం....

ఇవేవీ చూడలేకపోయానే అని ఎంతో బాధపడ్డాను

దేవా.. ఏమి నేను చేసిన పాపం అని అర్ధించాను...

ఈ లోకం చూడలేని జీవితం అని రోదించాను....

కాని అమ్మా.......

ఆసిడ్ బాటిల్స్ తో అబలలను వేదించే లోకమిదని...

అన్యాయం న్యాయం అయి పాలించె రాజ్యమిదని....

అడుగడుగునా భూ ఆక్రమణలు...

కలుషితమైన గంగా జలాలు....

కులమని,మతమని తన్నుకునే కుంచిత హృదయాల లోకమిదని...

తెలియక రోధించానమ్మ...

లోకాన్ని చూడలేకపోవడం అంధత్వం కాదని...

లోకంలోని అన్యాయాలను చూడకపోవడం

నిజమైన అందత్వం అని తెలుసుకున్నాను...

ఈ లోకంలోని దారుణాలను చూడకుండా

ఈ అందత్వం అనే వరాన్నిచ్చిన ఆ

పరమేశ్వరునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా..

( ఈ టీవీ లో బ్లాక్ ప్రోగ్రాం లో అంధుల ప్రదర్శన అనంతరం హృదయ స్పందన)


బాపూజీ కళ్ళలో సారాచుక్కలు

ఎంత దౌర్బాగ్యం.... ఎంత దారుణం
పరజాతి చెరనుండి జాతి ని విడిపించిన
బాపు ఆస్తులు పరజాతి చెరలో....
వెలకట్టలేని వస్తువులకు వేళ కడుతూ ఉంటే...
మద్యనిషేధం కోసం పోరాడిన బాపు ని
చెర విడిపించింది సారా ధనం
ఎంత దౌర్భాగ్యం...ఎంత దారుణం...
ఏరి ఆయన అడుగుజాడల్లో నడిచే గాంధేయ వాదులు...
ఏరి ఆయన దేశం లో ఆయన ఫోటో తో
కోటీశ్వరులైన అంబానీలు, టాటాలు....
ఎక్కడ ఈ దేశాన్ని ఏలే పాలకులు...
ఎంత దౌర్భాగ్యం... ఎంత దారుణం...
ఆయనను స్వతంత్రుడను చేసేందుకు...
సారా ధనం తప్ప ఈ దేశంలో మరే ధనం లేదని తెలిసి
ఆ అహింసా మూర్తి... ఆ జాతిపిత కళ్లు...
కన్నీళ్లు కాక సారా చుక్కలు కారుస్తున్నాయేమో...