అమ్మ... ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా
నాన్నా........ అందాలను ఎందుకు చూడలేను నాన్నా...
లోకమెంతో అందంగా ఉంటుందని...
అవి చూసేందుకు రెండుకళ్ళు చాలవని
చెప్తుంటే విని కుమిలి కుమిలి ఏడ్చాను...
అందమైన హిమవన్నగాలు... అమరమైన గంగా పరవళ్ళు...
వెన్నెల రాత్రులు...స్వచ్చమైన మల్లెల అందం...
శ్రీ వేంకటేశ్వరుని అమర రూపం....
ఇవేవీ చూడలేకపోయానే అని ఎంతో బాధపడ్డాను
దేవా.. ఏమి నేను చేసిన పాపం అని అర్ధించాను...
ఈ లోకం చూడలేని జీవితం అని రోదించాను....
కాని అమ్మా.......
ఆసిడ్ బాటిల్స్ తో అబలలను వేదించే లోకమిదని...
అన్యాయం న్యాయం అయి పాలించె రాజ్యమిదని....
అడుగడుగునా భూ ఆక్రమణలు...
కలుషితమైన గంగా జలాలు....
కులమని,మతమని తన్నుకునే కుంచిత హృదయాల లోకమిదని...
తెలియక రోధించానమ్మ...
లోకాన్ని చూడలేకపోవడం అంధత్వం కాదని...
లోకంలోని అన్యాయాలను చూడకపోవడం
నిజమైన అందత్వం అని తెలుసుకున్నాను...
ఈ లోకంలోని దారుణాలను చూడకుండా
ఈ అందత్వం అనే వరాన్నిచ్చిన ఆ
పరమేశ్వరునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా..
( ఈ టీవీ లో బ్లాక్ ప్రోగ్రాం లో అంధుల ప్రదర్శన అనంతరం హృదయ స్పందన)
1 comment:
లోకాన్ని చూడలేకపోవడం అంధత్వం కాదని...లోకంలోని అన్యాయాలను చూడకపోవడం నిజమైన అందత్వం అని తెలుసుకున్నాను
baagaa cheppaaru
Post a Comment