ఇల్లు నాది, ఊరు నాది..
గాలి నాది....నిప్పు నాది....
నీరు నాది, పుడమి నాది....
ఈ నేల లోనే పుట్టినాను..
ఈ ఊరు లోనే పెరిగినాను...
నీరు నన్ను ఆదుకుంటే...
గాలి స్వేఛ్చ ను నాకు ఇస్తే....
ఇల్లు నాదని..ఊరు నాదని...
భాష నాదని హాయిగుంటే...
ఊరు నన్ను తరిమివేసెను...
ఇల్లు నన్ను వెళ్ళగొట్టెను...
గాలి నాది కాదని ద్రోహి నేనని ముద్రవేస్తే...
స్వంతింట్లో బ్రతకడానికి హక్కు లేక...
దుక్కి దున్నే పొలం నన్ను వెక్కిరిస్తే...
దారి లేక, ఆశ చావక ఆయుధం తోడు ఇస్తే...
హక్కులకు, నా ఆశలకు పోరాటమే మార్గమయితే...
తీవ్రవాది నేనని బ్రతకటానికి హక్కు లేదని
రేచు కుక్కల, విహంగాల తోడు తో నను వెంబడిస్తే...
బ్రతుకు ఆశలో బాటసారి గా భూమి పై ఆశ చావక
బుడి బుడి అడుగుల పసిజీవితాలకొక రేపు నివ్వాలని...
ఊరు,గాలి, నిప్పు,నేల నాది నాకు కావాలని
పోరాటమే మార్గమని ప్రాణం ప్రాణం అల్పమంటే...
దేశద్రోహి నీవు అంటూ, బ్రతకడానికి హక్కు లేదని
దేశమే నను చంపివేసే....రాజ్యమే నా అంతు చూసే...
స్వంత ఇంట్లో బానిసలుగా బ్రతకలేక చావలేక...
వేరు వెళ్ళే దారి లేక కత్తి పట్టి పోరు సల్పి...
అమరులయ్యే యువకులతో నేను సైతం పోరుసల్పి....
నను కాదన్న నేల లోనే కలిసిపోతే...గాలి లో ప్రాణం కలిసిపోతే...
జవాబు లేని ప్రశ్న ఒక్కటే... నేను దేశద్రోహి నా....
నన్ను తరిమికొట్టిన నా రాజ్యం..నా స్వరాజ్యాన్ని
హరించిన పాలకులదా దేశద్రోహం...
No comments:
Post a Comment