కొంత మంది మరణిస్తారు..
మనం రోజూ బ్రతికి ఉంది మరణిస్తూ ఉంటాం...
మరి కొందరు మరణించినా బ్రతికే ఉంటారు...
మా గుండెల్లో బ్రతికుం టావు మా వేటూరి....
పాట మీ ప్రాణమై...పలుకు మీ శ్వాస అయి..
ప్రతి పదం తో మమ్మల్ని ఊరించి ఆలరించి..
వేటూరి లేని తెలుగు సినిమా లేదని...
తెలుగు పాటల పూదోటకు తోటమాలి నీవని..
ఏమి చెప్పను మహర్షి మీ గురించి...
ఎలా పాడను తండ్రి మీ గీతాన్ని..
కలాన్నిబలం చేసుకొని మరో లోకం సృష్టించి పద శిల్పి మీరు ...
పాటకు ముద్దుబిడ్డవై...తెలుగు సినిమాకు ప్రాణ వాయువై...
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకని రాసిన మీరు
రాగాల పూదోటని వదిలి వెళ్ళిపోయావా స్వామి...
తల్లి సరస్వతి లో ఏకమై పోయావా ఓ ముని..
మీ పాటలో మిమ్మల్ని చూసుకుంటామని..
మీకు మరణం లేదని ఒట్టేసి చెపుతున్నా
No comments:
Post a Comment