Thursday, April 30, 2009

మహాకవి కి శతవందనాలు...

తెలుగుతల్లి కి ముద్దుబిడ్డడు...తెలుగు కవితకు రేడు ఇతడు...

తెలుగు భూమి కి తిలకమితడు...తెలుగు భాషకే గౌరవమితడు...

నేను సైతం అని ప్రపంచ భాదను తన భాధగా మార్చుకున్న

హృదయమంతా బాధ నింపుకున్న ప్రపంచవాది ఇతడు...

తన మహాప్రస్థానం తో మరోప్రపంచం నిర్మించాలని

తన కవితలతో ఖడ్గసృష్టి చేసిన చైతన్యవాది ఇతడు...

ఈ శతాబ్దం నాదే నంటూ పేద ప్రజల రుదిరఘోష ను

ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి ఈతడు...

శ్రీ శ్రీ అంటే తెలుగుకవిత అని,తెలుగు కవిత అంటే శ్రీ శ్రీ అని

కవితా ఓ కవితా అని కవితాకన్య ను ఆరాధించిన భావికుడితను....

ఓ మహాకవి...ఓ చైతన్యవాది...ఓ విప్లవ కవి....

శతవసంతాలు నింపుకున్న మీకు జోహార్లు పలుకుతూ....

మీ కవితాకన్యక మరో సహస్రవర్షాలు నవయవ్వనంగా..

ఉండాలని ఈ అభిమాని ఆకాంక్ష...

Wednesday, April 22, 2009

ఉచిత ప్రసంగం......

ఉచితం ఉచితం అని ప్రచారం చేస్తున్న నాయకుడా...
ఓటేస్తే అన్ని ఉచితం అని ఆశపెడ్తున్నపాలకుడా..
వోటు కోసం ఏమి చేసినా సరి అనుకునే ఓ లీడర్ గారు...
గుర్తుంచుకో మా భారతీయులు బెగ్గర్లు కాదని....
అర్ధం చేసుకో మాకు వ్యక్తిత్వం ఉందని...
విద్యుత్ ఉచితం, నీరు ఉచితం, గాలి ఉచితం,
డబ్బు ఉచితం, ఆఖరికి బ్రతకడం కూడా ఉచితమేనా...
నవభారత హృదయం కోరుతోంది అభివృద్ది...
యువభారతం కోరుతోంది నిజాయితి....
రంగులు మార్చే ఊసరవెల్లుల రోజులు ఇకలేవు...
ఆశలు పెట్టె నాయకులను తరిమే సమయమిది...
ఈ రోజు కడుపు నింపే భోజనం నాకొద్దు...
ప్రతిరోజు ఆకలి తీర్చే జీవితం కావాలి....

Sunday, April 19, 2009

కొనసాగుతున్న యుద్ధం...

అడుగడుగునా దాడులు...ప్రతిక్షణం మరణాలు...

ఒక వైపునుండి బాంబులు....మరో వైపు నుండి షెల్లింగ్లు...

దూసుకొచ్చే సైనికులు....మరణించే ప్రజలు...

ఊళ్లకు ఊళ్ళు మాయం అయిపోతుంటే

వందలకు వందలు శవాలు గుట్టలుగా పోగవుతుంటే

పసిపిల్లలు....వృద్ధులు....గర్భిణి స్త్రీలు...ఏమి చేసారు వీళ్ళు...

తిండి కోసం పని చేసుకుంటూ...రోజు గడిచేందుకు పోరాడుతూ..

బోసి నవ్వులు నవ్వుతూ...కొత్త భవిష్యత్తు కలలు చూస్తూ...

అమ్మ ఒడిలో హాయిగా నిదురపోతూ...

బయటకు వెళ్ళిన పతి కోసం ఎదురు చూస్తూ...

ఆకసం లో విహంగం మృత్యువును కిందికి విడిస్తే....

ఒక్క క్షణం అంతా భస్మం అయిపోతే....

ఒక్క క్షణం లో అన్ని ఆశలు ఆవిరి అయిపోతే...

ఒక్క క్షణం లో బంగారు భవిష్యత్తు అంధకారం అయిపోతే...

రక్షకులే భక్షకులై పాలకులే రాక్షసులై...

ప్రాణాలు తీసుకుంటే...ఇంకెక్కడి దేశమది...

ఇంకెక్కడి రాజ్యమిది...

నాకిది కావాలంటే తండ్రి చంపేస్తే....

తప్పు చేస్తే తల్లి తల తీసేస్తే...

ఆ ప్రేమకు ఎక్కడ అర్ధం...

ఇక ఆ కుటుంబానికి ఏది పరమార్ధం...

ఏలే వాళ్ళు ప్రజలకు తల్లితండ్రులు కారా?

ఐతే మరి ఎందుకు ఈ దారుణం...

దేశం లో సాగే యుద్ధం లో ఆవిరయ్యే

అమాయకుల ప్రాణాలు...

ప్రభుత్వం చిట్టాలో తీవ్రవాదుల శవాలు...

తిండిలేక... మందులేక మరణించే మరికొందరు...

కనిపించరా వీరు మీకు ఏలికలూ...

శ్రీలంక అయినా, ఇరాక్ అయినా...

ఆఫ్ఘానిస్తాన్ అయినా...

ప్రాణం విలువ ఒక్కటే... యుద్ధం ఫలితం ఒక్కటే...

వేర్పాటువాదం సామ్రాజ్యవాదం మనలను యేలుతుంటే...

ప్రాణాలకు ఏది ఇక రక్షణ...జీవితాలకు ఏది ఇక భీమా..

( శ్రీలంక లో, ఇరాక్ లో, ఆఫ్ఘానిస్తాన్ లో,ప్రపంచం లో అన్ని మూలలలో యుద్ధానికి బలవుతున్న ఎందఱో అమాయక ప్రజలకుశ్రద్ధాంజలి.... మొగ్గలోనే వాడిపోతున్న ఎందరో పసిపిల్లల బంగారు భవిష్యత్తు కు ఇదే నా అశ్రుతప్త శ్రద్ధాంజలి)

A news post in Sakshi News paper... Picture of My grandfather Shri K. narasingarao welcoming jawaharlal nehru is published.


Thursday, April 16, 2009

డబ్బు...డబ్బు...డబ్బు...

డబ్బు...డబ్బు..డబ్బు...
కట్టలుగా....గుట్టలుగా....దొంతరలుగా డబ్బు...
ఎక్కడ చూసినా డబ్బు...ఎక్కడ వెదికినా డబ్బు...
లెక్కలేనంత డబ్బు.....
ఎన్నికలంటే ప్రజభిమానానికి కొలబద్దలు కాక
ధనవంతుల బలానికి పోటీలయితే
వోటుకు డబ్బు సమాధానమయితే
ఎన్నికలంటే డబ్బుపండగలు కాక మరేమిటి...
ఒకవైపు గుట్టలుగా దొరులుతున్న డబ్బు....
మరోవైపు ఆకలితో మండుతున్న కడుపులు...
ఒకవైపు యేరులాగా పారుతున్న మందు సీసాలు...
మరో వైపు తాగేందుకు నీళ్లు లేని గొంతులు....
ఎన్నికలలో పోటీ కి అర్హత డబ్బు అయితే...
ప్రజాభిమానానికి నిచ్చెన మందు సీసాలయితే.....
ఎన్ని ఎన్నికలొస్తే ఏమి లాభం...
నరజాతి చరిత్ర సమస్తం స్వజాతి పీడనం...

Sunday, April 12, 2009

నా కలలు...

నా కనులలో కలలు మెరుస్తున్నాయి...
కలలలో పంచవర్ణ స్వప్నాలు...
స్వప్నాలలో ఆశల సౌధాలు...
బ్లాక్అండ్ వైట్ నుండి ఈస్ట్ మాన్ కలర్ లోకి మారి
నను వెంటాడుతున్న కలలు....
మాయాబజార్ తో మొదలై మేఘసందేశం తో బలపడి...
ఖైది తో బాల్యాన్ని దాటి...గీతాంజలి తో టీనేజ్ లోకి అడుగుపెట్టి...
శివతో ఆవేశాన్ని, ఆలోచనను తోడు చేసుకొని...మరింత పెద్దవై
నా కలలు నన్ను వెంటాడుతున్నాయి...
ఒక్కోసారి లాంగ్ షాట్లు, మరోసారి క్లోస్అప్ లో....
ఒక్కోసారి కామెడీ , ఇంకో సారి మెలోడ్రామా..
ఒక్కోసారి లవ్ స్టొరీ, మరోసారి అక్షన్
నా కలలు నన్ను డామినేట్ చేస్తూ
నన్ను శాసిస్తున్నాయి...

Friday, April 10, 2009

ఎన్నికలు వస్తున్నాయి...

ఎన్నికలొస్తున్నాయి ...వస్తున్నాయి...వస్తున్నాయి....

ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండగలు వస్తున్నాయి

కోటిఆశలను శతకోటి వాగ్దానాలను తీసుకొని వస్తున్నాయి....

ఐదేళ్లకు ఒకసారి ప్రజలను నాయకులకు గుర్తు తెచ్చే...

పండగలు వస్తున్నాయి...

అన్ని ఉచితంగా ఇస్తామంటారు....

సామాజిక న్యాయం తెస్తామంటారు

ప్రజలే దేవుళ్ళు అంటారు....సమాజమే దేవాలయం అంటారు...

ప్రజల జీవితం లో మార్పు తెస్తామంటారు...

ప్రజల సమస్యలకు తామే సరయిన సమాధానం అంటారు...

అభివృద్ది అంతా తమతోనే అంటారు....

అమ్మ వోటు వెయ్యి... అయ్యా వోటు వెయ్యి అని

మెర్సిడెజ్ బెంజ్ లు, స్కోడా లు వదిలేసి

పాదయాత్రలు చేస్తారు...

ఐదు నక్షత్ర పాకశాలలు వదిలేసి...

రోడ్డు పక్కనే మీతోనే మా భోజనం అంటారు...

ప్రజలలో మమేకం అవుతారు...

వోటు కోసం ఏమైనా చేస్తారు...

మందు పోయిస్తారు... పచ్చనోటు ఇస్తారు...

మహిళలను దేవతలంటారు..

సీమంతాలు చేయిస్తారు...

ఎన్ని అడ్డదారులయినా తొక్కుతారు...

ఎన్నికయితే ఐదేళ్ళ వరకు తిరిగి చూడరు...

ఎన్నికలంటే ప్రజాభిమానానికి కొలబద్దలు ఒకనాడు....

ఎన్నికలంటే ధనానికి, బలగానికి పోటీలు ఈనాడు...

ఎంత డబ్బు చల్లితే అంత పెద్ద నాయకుడు అవుతాడు...

ఎంత దాదాగిరి చేస్తే అంత బలవంతుడు అంటారు....

విలువైన వోటు పచ్చనోటు కు సారాప్యాకెట్ కు అమ్ముడుపోతే...

ఏది ప్రజాస్వామ్యం...ఎక్కడుంది ప్రజలరాజ్యం....

Thursday, April 9, 2009

రెండో స్వాతంత్ర్య సమరం...

ఏమిటి ఈ దౌర్జన్యం.... ఏమిటి ఈ దుర్మార్గం.

మనవాళ్ళే పగవారై గొంతుకలు కోస్తుంటే...

మనఇల్లే చెరసాలయిమమతలు దూరం చేస్తుంటే...

ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది...

ఇంతకన్నా దుర్మార్గం ఏముంది...

నా ప్రాంతం గొప్పంటే నా ప్రాంతం గొప్పని....

నా కులం గొప్పంటే నా కులం గొప్పని...

ప్రేమలస్థానంలో వైషమ్యాలు...

ఆనందం స్థానం లో ఆవేశాలు...

ఇదేనా గాంధీజీ కోరుకున్న స్వాతంత్ర్యం...

పరజాతి చేతులనుండి మనజాతి చేతులలో

బానిసయిన భారతజాతి..

మనవాళ్ళే డయ్యర్ లు అయ్యి మనవాళ్ళను చంపుతూ...

జలియన్ వాలా బాగ్ లు తయారు చేస్తుంటే...

ఇంతకంటే ఉందా దుర్మార్గం...

ఇంతకంటే ఉందా దౌర్జన్యం...

ఈ ఆవేశాల నుండి.... ఈ అసూయల నుండి....

ఈ దుర్మార్గం నుండి...ఈ దౌర్జన్యం నుండి....
ఈ మనదేశపు శత్రువుల నుండి...

మన దేశాన్ని...మన భవిష్యత్తు ను

మన ప్రేమలను... మన ఆత్మీయతలను

కాపాడుకునేందుకు చెయ్యాలి...

రెండో స్వాతంత్ర్య సమరం....

తీసుకురావాలి అరమరికలు లేను కొత్త ప్రపంచం...

మేరా భారత్ మహాన్ అని గొంతు చించుకు అరిచేలా...

వందేమాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా..

దేశమాత పై ప్రేమ ను చూపిస్తూ....

మనజాతి గొప్పతనాన్ని అన్నిజాతులూ గుర్తించేలా...

చెయ్యాలి రెండో స్వాతంత్ర్య సమరం....

Tuesday, April 7, 2009

వెలుగు....

అహంకారం మనిషి లోని వికాసాన్ని ఆపినప్పుడు...
అజ్ఞానం మనిషి ఆలోచన ను ఎధగనివ్వనప్పుడు
స్వార్ధం మనిషి లోని సేవాగుణాన్నిచంపివేసినప్పుడు...
కృతిమత్వం జీవితంలోని సహజత్వాన్ని తరిమివేసినప్పుడు....
కావాలి ఒక వెలుగు.... జీవితచక్రాన్ని మార్చేందుకు....
రావాలి కొత్త వెలుగు ...మనిషి దృక్పధాన్ని మార్చేందుకు....

Sunday, April 5, 2009

ననుగన్న తల్లి నా రాయలసీమ

ననుగన్న తల్లి నా రాయలసీమ

రతనాలసీమ ఈ పుణ్యభూమి...

నల్లరేగడితో పసిడిపంటలనెలఈ సీమ...

ననుగన్న తల్లి నే కన్నతల్లి రాయలసీమ...

తిరుపతివెంకన్న ఆశీర్వదించగా...

శ్రీశైల మల్లన్న చల్లంగా చూడగా...

మంత్రాలయ రాఘవెంద్రుడే మహిమలను పంచగా...

అహోబిలనరసింహుడు అహంకారాన్ని వదించగా...

ప్రశాంతినిలయం లో సత్యసాయి విశ్వశాంతిని పంచగా...

శ్రీకృష్ణదేవరాయల రతనాలసీమ ఇది....

నన్నుగన్న తల్లి నా రాయలసీమ..

పదకవితాపితామహుడు అన్నమయ్య పుట్టింది ఇక్కడే...

సంకీర్తన సామ్రాట్ త్యాగరాజు మూలాలు ఇక్కడే...

యోగివేమన శతకాలు రాసింది ఇక్కడే...

పోతులూరి వీరబ్రహ్మేంద్రుడు కాలజ్ఞానం రాసింది ఇక్కడే....

పోతన రామాయణం రచన సాగింది ఇక్కడే....

సరస్వతి దేవి వసించిన భూమి ఇది...

సాహితి సంస్కృతుల పట్టుగొమ్మ ఇది...

నన్ను కన్నతల్లి నే కన్నా తల్లి రాయలసీమ...

పౌరుషాల పోరుగడ్డ కడప ఒక వైపు...

నవనందుల నంద్యాల మరో వైపు....

ఆధ్యాత్మికనెలవు చిత్తూర్ మరో వైపు....

నల్లరేగడి సీమ అనంతపురం మరో వైపు...

మాట ఇచ్చినా మేమే...కత్తి తీసినా మేమే...

భక్తిలోనా మేమే... భావం లోన మేమే....

ఆతిధ్యానికి మేము పెట్టింది పేరు...

ననుగన్న తల్లి నా రాయలసీమ...

గాడిచర్ల హరిసర్వోత్తమరావు కన్నతల్లి ఇది...

కాదర్బాద్ నరసింగరావు పుట్టినభూమి ఇది....

నీలం సంజీవరెడ్డి జన్మభూమి ఇది...

కట్టమంచి రామలింగారెడ్డి చదువు పంచిన సీమ ఇది...

జిడ్డు కృష్ణమూర్తి జన్మించిన నేల ఇది....

నన్ను గన్న తల్లి నా రాయలసీమ...

ఈ తల్లి ఒడిలో పుట్టే అదృష్టం....

ఈ సీమనీరు తాగే పుణ్యం....

ఈ జన్మకే కాదు మరు జన్మ లోను కావాలి..

ఈ తల్లి సేవ లో నా జన్మ పునీతం కావాలి...

యమపురికి ప్రయాణం

జనం పరిగెడుతున్నారు....క్యూలు తెంచుకొని...
ఖాళీలు ఏమి లేవు...అంతా వెయిటింగ్ లిస్టు...
అక్కడికి వెళ్లేందుకు బస్సులు లేవు..రైళ్ళు లేవు...
అక్కడికి వెళ్ళాలని ఎవరికీ ఉండదు....
న్యూయార్క్ బెంనింగ్టన్ లో పదిహేను మంది...
పాకిస్తాన్ లోని చక్వాల్ లో ముప్పై ఐదు మంది..
శ్రీలంక లో మూడువందల యాభై మంది...
మరోచోట కుటుంబం ఆత్మహత్య...
ఇంకో చోటు బస్సు పల్టి కొట్టి ముగ్గురి మృతి...
రహదారులే మృత్యు శకటాలయితే...
తీవ్రవాదం కట్టలు తెంచుకుంటే...
ప్రభుత్వాలే యమకింకరులయితే...
నూరేళ్ళ జీవితాలకు స్పీడ్ బ్రేకర్ లు ఎన్నో...
ఎన్నో ఆశలను కోరికలను పురిటిలోనే చంపేస్తే...
అన్నిటికన్నా పెద్ద క్యూ యమపురికే....


మా అమ్మమ్మ..

వెన్నెల కే రూపమొస్తే ఆమె అవుతుందేమో...
చంద్రుడు చిరునవ్వు నవ్వితే....
ఆ నవ్వు లో హిమవన్నాగం మెరిస్తే...
ఆ మెరుపులోని జీవం ఆమె కళ్ళలోనే చూడచ్చేమో...
సముద్రం విశాలం తెలియదు కాని...
ఆమె హృదయం మరింత విశాలం...
ప్రేమ ఆమె బాష... అనురాగం ఆమె శ్వాస...
నాకిది కావలి అని అడగకముందే...
మాకేం కావాలో ప్రత్యక్ష్యం...
ఆమె మార్గదర్శనం మాకు ఆదర్శం..
ఆమె ఆలోచనలు మాకు మార్గదర్శనం...
ఆమె తో గడిపిన జీవితం అజరామరం..
ఆమె లేని లోటు పూడ్చలేని అగాధం...
ఆమె కు అక్షరసుమాంజలి...
అమ్మమ్మా... నీకు నా వినమ్రవందనం...

మార్పు రావాలి

ఒక మార్పు రావాలి.....

అభివృద్ది కి మరో పేరు తేవాలి...

అభివృద్ది అంటే సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ లే కాదు...

సంక్షేమం అంటే రియల్ ఎస్టేట్, ఐ టీ పార్కులు, సెజ్ లే కాదు...

అభివృద్ది అంటే అందరు బాగుండడం..

సంక్షేమం అంటే ఉచిత పధకాలు కాదు...

అభివృద్ది అంటే శాశ్వతంగా మార్పు తేవడం...

ఒకరో, ఇద్దరో మారితే అభివృద్ది అయిపోతే...

వంద కోట్ల భారతీయులలో కోటిమంది కి తిండి దొరికితే..

ఏ దేశం కూడా అభివృద్ది చెందదు...

నాకుందని చెప్పడం, చూపించడం గొప్ప కాదు...

నీకున్నది పంచడం, మంచిని పెంచడం నీ ధర్మం...

సుజలాం, సుఫలాం అని పాడడమే కాదు...

అందరు మనస్పూర్తిగా పాడేలా చెయ్యాలి...

ఎదుట కనిపించే నిజాన్ని చూడకుండా..

కనులు మూసి స్వప్నం లో బతుకుతూ...

ఇదే అభివృద్ది అనుకుంటే పొరపాటు....

స్వార్ధం తో నీ కోసం బ్రతుకుతూ...

సంపద నే పరమార్ధం అనుకుంటూ..

నేనోక్కడు బాగుంటే చాలనుకుంటే...

ఎప్పుడు రావాలి సంక్షేమ భారతం...

ఎప్పుడు కావాలి సుసంపన్న భారతం...

అందుకే నేస్తం... మార్పు రావాలి...

స్వార్ధాన్ని కట్టిపెట్టి నీకున్నది పంచు....

సంపదనే కాదు విజ్ఞానం కూడా...

ఒకసారి చేసేది సహాయం అవుతుంది...

శాశ్వతంగా మార్పు తెస్తే అభివృద్ది అవుతుంది...

ఈ మార్పు కు అభివృద్ది కి ఈ క్షణం నాంది కావలి...

సంక్షేమ భారతానికి, సుసంపన్న భారతానికి పునాది వెయ్యాలి....

Neethu's second song

(Neethu's second song. One day neethu got up early in the morning before sunrise and told this song to her mom looking at sunrise. Yesterday i was reading lord Hanuman praising sun when he saw sun first time. It totally reflects the same.)


The Sun is bright everytime I look at it

It's like an yellow apple on the tree

You know how you feel it when you see it.

It's so wonderful that you'll like it

Just before the sunrise you can see the Sun rise

Our heart is so happy when we see the Sun

Birds are chirping...It's a beautiful natural world

It's a beautiful sunny spring

The flowers are beautiful

Everytime you see the bright Sun,birds and flowers

you feel the love the heart is filled with the natural and feel like the earth is hugging you

Saturday, April 4, 2009

నా ఆశ.. నా శ్వాస...

నా కలలకు కళ్లు వస్తే...
నా ఆశలకు రెక్కలు వస్తే...
నా ఆలోచనలకు ఊపిరి పోస్తే..
నా ఆదర్శాలకు కాళ్ళు వస్తే....
సమాజాన్ని ఒక దేవాలయం లా...
సంఘం లో అందరు కుటుంబం లా...
కులంలేక మతం లేక...
అందరు ఒకటై...అంతాఒకరై
అసమానతలు దూరం చేసి...
దురభిమానానికి కళ్ళెం వేసి...
ప్రేమ అనే తులసి మొక్కకు నీళ్లు పోసి పంచుతా...
ఆప్యాయతలనే సంజీవినితో
ఈ మృత సమాజానికి ఊపిరి పోస్తా..
ఇదే నా ఆశ... ఇదే నా శ్వాస...

మార్చుకో.. నీ జీవనగమ్యం...

నేను నావాళ్ళు అని

స్వార్ధం తో ఆలోచించే ఓ మనిషి....

నా ఆస్తులు...నా సంపాదన అని

యాంత్రికంగా జీవించే ఓ మనిషి....

పక్కవాడికి ఏమైనా పర్లేదు...

నేను బాగుంటే చాలని ఆలోచించే ఓ మనిషి...

ఆలోచించు ఒకసారి....నీ జీవిత సారం...

ఇరుకైన మనసుతో చిన్నవైన కుటుంబాలలో

మమతలు కరువై, బంధాలు మరుగై

మానసికంగా బలహీనమైన ఓ మనిషి...

ఆలోచించు ఒకసారి...నీ జీవన గమ్యం...

పంచుకుంటే పెరిగేది ప్రేమ...

తుంచుకుంటే తెగేది బంధం....

ఒక్కడిలా ఎన్నాళ్ళీ జీవితం...

పంచుకో నీ జీవితాన్ని అందరితో...

పెంచుకో ఆప్యాయతల ఆస్తులను...

అవుతావు నువ్వు అభిమాన లక్షాధికారి...

లేకుంటే అవ్వాలి నిర్లక్ష్యపు అంతానికి సాక్ష్యం..

ఆలోచించు సోదరా నీ జీవిత సారం...

మార్చుకో ఇకనైనా నీ జీవన గమ్యం...