ఎన్నికలొస్తున్నాయి ...వస్తున్నాయి...వస్తున్నాయి....
ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండగలు వస్తున్నాయి
కోటిఆశలను శతకోటి వాగ్దానాలను తీసుకొని వస్తున్నాయి....
ఐదేళ్లకు ఒకసారి ప్రజలను నాయకులకు గుర్తు తెచ్చే...
పండగలు వస్తున్నాయి...
అన్ని ఉచితంగా ఇస్తామంటారు....
సామాజిక న్యాయం తెస్తామంటారు
ప్రజలే దేవుళ్ళు అంటారు....సమాజమే దేవాలయం అంటారు...
ప్రజల జీవితం లో మార్పు తెస్తామంటారు...
ప్రజల సమస్యలకు తామే సరయిన సమాధానం అంటారు...
అభివృద్ది అంతా తమతోనే అంటారు....
అమ్మ వోటు వెయ్యి... అయ్యా వోటు వెయ్యి అని
మెర్సిడెజ్ బెంజ్ లు, స్కోడా లు వదిలేసి
పాదయాత్రలు చేస్తారు...
ఐదు నక్షత్ర పాకశాలలు వదిలేసి...
రోడ్డు పక్కనే మీతోనే మా భోజనం అంటారు...
ప్రజలలో మమేకం అవుతారు...
వోటు కోసం ఏమైనా చేస్తారు...
మందు పోయిస్తారు... పచ్చనోటు ఇస్తారు...
మహిళలను దేవతలంటారు..
సీమంతాలు చేయిస్తారు...
ఎన్ని అడ్డదారులయినా తొక్కుతారు...
ఎన్నికయితే ఐదేళ్ళ వరకు తిరిగి చూడరు...
ఎన్నికలంటే ప్రజాభిమానానికి కొలబద్దలు ఒకనాడు....
ఎన్నికలంటే ధనానికి, బలగానికి పోటీలు ఈనాడు...
ఎంత డబ్బు చల్లితే అంత పెద్ద నాయకుడు అవుతాడు...
ఎంత దాదాగిరి చేస్తే అంత బలవంతుడు అంటారు....
విలువైన వోటు పచ్చనోటు కు సారాప్యాకెట్ కు అమ్ముడుపోతే...
ఏది ప్రజాస్వామ్యం...ఎక్కడుంది ప్రజలరాజ్యం....
No comments:
Post a Comment