నేను నావాళ్ళు అని
స్వార్ధం తో ఆలోచించే ఓ మనిషి....
నా ఆస్తులు...నా సంపాదన అని
యాంత్రికంగా జీవించే ఓ మనిషి....
పక్కవాడికి ఏమైనా పర్లేదు...
నేను బాగుంటే చాలని ఆలోచించే ఓ మనిషి...
ఆలోచించు ఒకసారి....నీ జీవిత సారం...
ఇరుకైన మనసుతో చిన్నవైన కుటుంబాలలో
మమతలు కరువై, బంధాలు మరుగై
మానసికంగా బలహీనమైన ఓ మనిషి...
ఆలోచించు ఒకసారి...నీ జీవన గమ్యం...
పంచుకుంటే పెరిగేది ప్రేమ...
తుంచుకుంటే తెగేది బంధం....
ఒక్కడిలా ఎన్నాళ్ళీ జీవితం...
పంచుకో నీ జీవితాన్ని అందరితో...
పెంచుకో ఆప్యాయతల ఆస్తులను...
అవుతావు నువ్వు అభిమాన లక్షాధికారి...
లేకుంటే అవ్వాలి నిర్లక్ష్యపు అంతానికి సాక్ష్యం..
ఆలోచించు సోదరా నీ జీవిత సారం...
మార్చుకో ఇకనైనా నీ జీవన గమ్యం...
No comments:
Post a Comment