Saturday, February 28, 2009

కాదర్ బాద్ నరసింగరావు

సమాజం ఆయనకు దేవాలయం... సంఘం ఆయన ఇల్లు...

దాతృత్వం ఆయన లక్షణం, బ్రాతుత్వం ఆయన ఆశయం...

అందరు చదువుకోవాలని ఆయన కోరిక....

పట్టెడన్నం లేకుండా ఎవరూ అలమటించకూడదని ఆయన ఆశ....

అంతరానితం పారద్రోలాలన్నది ఆయన లక్ష్యం...

సమాజం లో అందరిని ఒక అన్నగా, ఒక చెల్లి గా..

ఒక అమ్మగా అందరి సౌఖ్యం చూసిన మహామనిషి

ఆయనే కీ!శే! కాదర్ బాద్ నరసింగరావు గారు.....

ఊరూరా హరిజన హాస్టల్ లు..

వాడవాడలా సహపంక్తి భోజనాలు....

పాఠశాలలకు స్వంత భూములు...

దేవస్థానాలకు...మసీదులకు అంకురార్పణ లు...

కులవివక్ష ను ఎదిరించి, విద్య అవసరాన్ని గ్రహించి...

ఎన్నో ఇళ్ళలో దీపాన్ని వెలిగించిన మహా మనిషి..

స్వార్ధం నాది కాదని... నిస్వార్ధం నా మార్గం అని...

నవరత్నాలను కన్నతండ్రి... సమాజం లోని

అందరిని తన బిడ్దలానుకున్నడు...

బడుగు జీవితాలలో విద్య ను నింపి వెలుగు ప్రసరించాడు....

భారతమాత సేవలో జైలు లో మగ్గుతున్న స్వతంత్రయోధుల

కుటుంబాల ఆకలిని ఆదుకున్న ఆదర్శమూర్తి ...

గాంధి, నెహ్రూ మార్గం లో దేశసేవ, సంఘసేవ

విద్యసేవ నేర్పిన నిజమైన స్వతంత్ర యోధుడాయన..

ఈ కాలంలో ఇంక జరుగుతున్న వివక్షలను

ఆ కాలంలోనే నిర్మూలించిన దార్శనీకుడు ఆయన...

మా అందరికి ఆదర్శం, మార్గదర్శనం ఆయన చూపిన మార్గం..

ఆయన వంశంలో పుట్టడమే మా పూర్వజన్మ సుకృతం...

మాకు దారిచూపి, మీ కీర్తిని మాకు పంచిన మహాత్మా..

మా పితామహా...అందుకోండి అక్షరాలతో

నా పాదాభివందనం...


నా ఆశ

ఏమండి రెడ్డిగారు ఏంచేస్తున్నారు????

ఏమయ్యా రాజు బాగున్నావా.....

అయ్యా శాస్త్రిగారు భోజనం అయ్యిందా!!!!!!!

సలాంవాలేకుం సాయిబు గారు...క్యా ఖబర్....

కులంపేర మతంపేర పిలుచుకునే సమాజం..

మానవత కు కడుతోంది శాశ్వతంగా సమాధి..

కులమేదో తెలియనంతవరకు అంతా ఒకే..

కులమేదో తెలిస్తే నీవు నేను ఇండో పాకే

మతమేదో చెప్పకుంటే నీవు నేను భాయి భాయి...

మతమిదని తెలిస్తే ఈ దోస్తీకి బై...బై...

ఎందుకీ దూరం...ఎందుకీ ద్వేషం...

నీ రక్తం నా నెత్తురు ఒకే రంగు..

నీ నీరు నా నేల ఒకే గూటి పక్షులే..

మన రక్తం.. మన గాలికి కులం తెలియనప్పుడు

మన నీరు... మన నేల కు మతం లేనప్పుడు...

ప్రపంచపు సరిహద్దులు ఇంటర్నెట్ చెరిపేస్తే...

మనుషుల మద్యం దూరం సెల్ ఫోన్ దగ్గర చేస్తే...

ఏ కులం గురించి నీ బాధ నేస్తం...

ఏ మతం గురించి నీ యుద్ధం సోదరా...

కులాలకు మతాలకు అర్థం చెరిపేసి

నీ కులం మానవకులమని

నీ మతం విశ్వమతమని

చెప్పేరోజు వస్తుందన్న ఆశ నాది..

రావాలన్న కోరిక నాది...

నాయకుల పర్యటన- ట్రాఫిక్ జామ్ లు

అయ్యగారు వస్తున్నారు అడ్డం జరగమ్మ...

అమ్మగారు వస్తున్నారు... కాస్త ఆగు బాబు...

అయ్యగారి సేవలో యావత్ నగరం

సామాన్య జీవితాలకు కాసేపు విరామం...

ఆఫీసు కు లేట్ ఐతే అయ్యవారి చిరాకు

ఆస్పత్రికి చేరకుంటే ప్రాణానికే ప్రమాదం...

బస్సులన్నీ అమ్మగారి సేవకే...

పోలిసులంతా అయ్యగారి రక్షణకే

ఊపిరిపీల్చాలన్నా అయ్యగారు దాటాలి..

షాపింగ్ కు వెళ్ళాలన్నా అమ్మగారు వెళ్ళాలి...

ట్రాఫిక్ జామ్ లో సామాన్యుడి జీవితం...

ఆడకత్తెర లో పోకచెక్క చందం...

ప్రజాసేవ అంటారు ప్రజలతో సేవ చేయుంచు కుంటారు...

వీళ్ళ చుట్టూ వందమంది పోలిసులు...

వంద మంది ప్రజలకు లేరు ఒక పోలిసు...

రక్షణ అంతా నాయకులకైతే సామాన్యుల గతి ఏమి...

సేవ అంత స్వాములకైతే ప్రజలకు రక్షణ ఏది....

సౌకర్యాలన్నీ దొరలకు కల్పిస్తూ

అసౌకర్యలన్నీ మాకు ప్రసాదం ఇస్తున్నారు...

అసలు ప్రజాసేవ చేస్తున్నది మీరా..

నాయకుల సేవ చేస్తున్నది మేమా...

ఎప్పుడిస్తారు ఈ ట్రాఫిక్ జామ్ లకు విరామం...

ఇస్తారా ఈ సామాన్యుడి జీవితానికి కొంత సమయం...











Friday, February 27, 2009

దేశమాత పిలుస్తోంది

దేశమాత పిలుస్తోంది సోదరా కదలిరా

మాతృభూమి పిలుస్తోంది తమ్ముడా కదలిరా...

తెల్లదొరల బానిసత్వ శృంఖలాలు తెంచుకుంటే

నల్లదొరలు వచ్చారు...

పరుల పీడ వదిలిందంటే మనవాళ్ళే

వంచకులయ్యారు..

దేశమంటే మట్టి కాదన్న గురజాడ ను వెక్కిరిస్తూ

దేశంలోని మట్టినంతా దోచుకుంటున్నారు...

రింగురోడ్ల పేరుతో ఎస్ఈజెడ్ ల సాకుతో

ఐటీ పార్కుల వంకతో భూమి పంచుకుంటున్నారు...

అడవులన్నీ నరికేస్తే...పొలాలన్నీ అమ్మేస్తే...

అయిపోదా ఈ దేశం కాంక్రీట్ అడవి...

మారిపోదా ఈ ఊరొక వేడికొలిమి....

వెచ్చనిరాత్రులను చల్లగా మార్చే శీతలపవనాలేక్కడ...

హాయిగా పరుచుకునే వెన్నెల రాత్రులేక్కడ...

ఎత్తైన మాల్స్ లో ఇరుకైన మల్టిప్లెక్స్లలో

పిల్లల బాల్యం బందీ అవుతోంది..

అపార్ట్ మెంట్ ల లిఫ్ట్ లలో, కార్టూన్ నెట్ వర్క్ లలో

దోబూచులాటలు, అష్టాచెమ్మలు కాలం చేసాయి...

అభివృద్ది మంచిదే, ఎదగడం మంచిదే...

మూల్యం గా జీవితాలు చెల్లించకు...

ప్రకృతి మాత ను బందించాలని చూడకు

వికృతి అయి కాటేస్తుంది....

అడవులను ఊరుగా మార్చబోకు

వనం పామై పగబడుతుంది...

దేశమాత పిలుస్తోంది సోదర కదలిరా...

మాతృభూమి పిలుస్తోంది తమ్ముడా కదలిరా...

మన ప్రకృతి, మన పచ్చదనం కాపాడే

ఉద్యమం మొదలుపెట్టి మేలుచేయ్యి...

మొక్కనాటి, విత్తు వేసి రాబోయే

కాలంలో బాల్యాన్ని కాపాడు....



చిట్టితల్లి....

సుషుప్తం లోంచి చైతన్యం లోకి

బోసి నవ్వులతో ఎన్నో ఆశలతో...

అడుగుపెడ్తోంది ఓ పసిపాప...

అమ్మ పొత్తిళ్ళలో సురక్షితంగా

ప్రపంచంలోని ప్రేమను అనుభవిస్తూ...

చిరునవ్వులు రువ్వుతున్న చిట్టితల్లి
ఎలా చెప్పను నీకు ఈ ప్రపంచం

నీ అంత పవిత్రం కాదని...

ఎలా చెప్పను నీకు ఇక్కడ ద్వేషాలే కాని
ప్రేమలు లేవని...

అందమైన భవిషత్తు కలలుకనే పసిపాప

ఉగ్రవాద భూతం నీపై నుందని గుర్తుంచుకో...

లోకమంతా నీ నవ్వులంత స్వచ్చమనుకునే చిట్టితల్లి..

కుట్రలు, కుతంత్రాలు ఇక్కడున్తాయని గమనించు...

నీ బోసినవ్వు మా మనసులు మార్చాలని...

నీ చిట్టి చేతులు మా చేతలు మార్చాలని

నీతోనైనా ఈ ద్వేషాలు ప్రేమలుగా మారాలని

నీ చిన్నిగుండె తోడుగా నా ప్రార్థన తల్లి












Thursday, February 26, 2009

అఖండభారతం...

దేశమాత కుత్తికలో కత్తులు దించి
దేహాన్ని పంచుకోవాలనే దుర్మార్గులు...
భాయి భాయి అనే బంధువులను
శత్రువులుగా మార్చే నీతిలేన్ని నాయకులూ...

భాష ముఖ్యం అన్నారు... ముక్కలుగా చేసారు...
ఉత్తరమా...దక్షిణమా ఏది నీ ఇల్లు అన్నారు...
వైషమ్యాలు రేపారు....
అందరికి స్వంతమైన నీరు నాది అన్నారు...
స్వార్ధం తో ప్రకృతి ని బందించాలని చూసారు...
సోదరుల మధ్య విద్వేషాలు తెచ్చారు...
హాయిగా బ్రతుకుతున్న జీవితాలను
కులం కత్తి తో పొడిచారు...
నా కులం గొప్ప...నీ కులం కాదన్నారు...
స్వార్ధప్రయోజనాలతో సమాజాన్ని చీల్చారు...
రాష్ట్రమాత శరీరాన్ని ఖండాలుగా నరికి
తెలంగాణా నీదని...ఆంధ్రమాత నీదని...
రక్తసిక్తం చేయాలని చూసారు...

మర్చిపోకు... మర్చిపోకు...మర్చిపోకు సోదరా...
ఉత్తరమైనా... దక్షిణమైనా...
ఏ కులం నాదైనా..ఏ మతం వారైనా...
ఏ ప్రాంతం వారైనా.. ఏ రాష్ట్రం వారైనా...
మనమందరం భారతమాత బిడ్డలం...
మనమందరం ఈ పుణ్యభూమి వారసులం..

తన బిడ్డలే విరోధులుగా మారుతుంటే...
చూడలేని దేశమాత రక్తాశ్రువులు కారుస్తుంటే...
ఎక్కడ నుంచి వస్తుంది సుసంపన్నభారతం...
ఎక్కడ నుంచి వస్తుంది సంక్షేమభారతం...
సుజలాం సుఫలాం అని రాగాలే కాదు...
బ్రాత్రుత్వం, సహజీవనం మన మార్గం కావాలి...
కుల మత ప్రాంతాలనే బేధాలు కాదు...
భిన్నత్వం లో ఎకత్వమైన భారతమాత హృదయమేలాలి...
అప్పుడే నిజమోతుంది అఖండభారతం...

నిశబ్ద విప్లవం

ఒక విప్లవం మొదలవ్వాలి
నిశబ్దంగా... ఉప్పెనలా...
అవినీతికి వ్యతిరేకంగా.... అసమర్ధత కు సవాలుగా...
ఒక విప్లవం మొదలవ్వాలి
నిశబ్దంగా..... ఉప్పెనలా...

ఎన్నాళ్ళు సహించాలి ఈ నిర్లక్ష్యం
ఎన్నాళ్ళు భరించాలి ఈ స్వార్ధం

ప్రపంచాన్ని ఎదిరించే గుండె ధైర్యం నీదైతే...
హిమాలయన్నైనా శాసించే ఆత్మవిశ్వాసం నీదైతే...
అవ్వాలి నీవే ఒక సైనికుడు....రావాలి నీవే ఒక విప్లవకారుడువై ......
సాదించాలి నిశబ్దవిప్లవం...

సముద్రానికైనా ప్రారంభం సిందువుతోనే
ఆకాశహర్మ్యనికైనా పునాది ఒక ఇటుకముక్కతోనే....
మహావ్రుక్షానికైనా బీజం ఒక చిన్నవిత్తులోనే...
ఒంటరి గా భావిస్తే ఒంటరిగా మిగిలిపోతావు...
చేయి చేయి కలిపితే సైన్యం గా మారుతావు...

ఏ ఆయుధం అవసరం లేదు..
ఏ సహాయం తోడు వద్దు...
అనుకున్నది సాధించే కోరిక నీదైతే...
అవుతావు దుర్మార్గం పై నీవే సునామి...

ఈ క్షణం నినదించు నేస్తం.....
అవినీతి ని పటాపంచలు చేస్తానని...
ఈ క్షణం గర్జించు నేస్తం...
దౌర్జన్యాలను సహించబోమని
నా అడుగు లో అడుగు కలుపు మిత్రుడా...
ఒక కొత్త లోకానికి బీజం వేస్తానని...
ఈ నిశబ్ద విప్లవానికి చేయూతనివ్వు సోదరా...
సమసమాజానికి బాటలు వేస్తానని...

Wednesday, February 25, 2009

Neethu's Song

This is a song written by my niece Neethu- 6 year old from Nashville TN., USA

Mom....It's your birthday
Thanks for all the love and care you give
I'll give the same love and care for you
Let God rule your heart in peace

Mom....It's your birthday
Thanks for all the love and care you give
Now clap your hands to the Lord...your God
Thanks for all the love and care you give
I'll give the same love and care for you
Just let me do that in my heart

Mom....it's your birthday
I hope you like it
Let God tell you that
Nobody can tell you what you can do
Mom....this is the end of the song I sang

స్లండాగ్ లు..... కోటీశ్వరులు

ఈ ప్రపంచపు స్లం డాగ్ లు పుడుతూనే ఉంటారు...
వందల్లో వేలలో

సమాజపు మురికి గుంటల్లో పడిలేస్తూ ఉంటారు.

ఒక పూట తిండి కోసం....ఒక రొట్టె ముక్క కోసం.

అలసిపోక ఆశచావక బ్రతకడం కోసం....

కేవలం బ్రతకడం కోసం పుడుతూనే ఉంటారు ప్రతిరోజు.....

ఇది కూడా జీవితమేనా అనిపించే జీవితం లో జీవిస్తూ..

ప్రతి ట్రాఫిక్ జంక్షన్ లో ప్రతి రోజు జీవిస్తూ...మరణిస్తూ...

సూర్యోదయం తో కొత్త జన్మ ఎత్తుతూ... ఆ రోజు జీవనం కోసం...

స్లండాగ్లు పుడుతూనే ఉంటారు...

నాలుగు అడుగుల జాగా లో నాలుగు మెతుకుల వేటలో

ఈ స్లండాగ్లు జీవిస్తూనే ఉంటారు.... సూర్యాస్తమయం తో మరణిస్తారు...

తిరిగి పుట్టడం కోసం...

వేటకుక్కలాంటి ఈ స్లండాగ్ లంటే....

కొందరికి జాలి...కొందరికి వినోదం...

ఈ జీవితాన్ని వినోదం లా తెర పై చూపే

బోయ్లేస్ ను మీరా నాయర్ ల ను

కోటీశ్వరులు చేస్తూ.....

అవార్డు లు రివార్డ్ లతో ప్రఖ్యాతం చేస్తూ....

ముంబై నుండి లాస్ అంజేలేస్ దాకా...

గోల్డెన్ గ్లోబ్ నుండి ఆస్కార్ దాకా....

మిలియన్ ల నుండి బిలియన్ లు సంపద సృష్టిస్తూ

ఈ స్లండాగ్ లు మాత్రం మురికిలో జీవిస్తూనే ఉన్నారు...

మరణిస్తూ ఉంటారు... నాలుగు మెతుకుల కోసం






Tuesday, February 24, 2009

అటల్ బిహారీ వాజ్ పేయ్

అచంచలమైన విశ్వాసం... ఆటల మైన నిబద్దత
అంతులేని దేశప్రేమ... ఆయన సొంతం.
చట్టసభలో ఆయన కంచు కంఠం
చేసింది దేశానికి దిశ నిర్దేశం...
ఎంతో మంది నాయకులకు
ఆయన అయ్యారు ఆదర్శం....
ఈ యుగపు మేటి నాయకుడైన
అటల్ జీ కి ఇదే నా అక్షర నమస్కారం.

Monday, February 23, 2009

అంతర్యుద్ధం

ఒక యుద్ధం మొదలైంది....
నాలోనే...నాతోనే...
ఒక అగ్నిగుండం బద్దలైంది...
నన్నే దహించివేస్తూ
ఓ ఆలోచన వెంటాడుతోంది...
జవాబు కోసం...
నేనెవరు...నేనేంటి....
నా ఆశల సౌధం ఇదేనా...
నా మనసును రంజింప చేసే సమీరం ఇదేనా..
నా లక్ష్యం ఏంటి... నేనేం చేస్తున్నాను...
అంతర మెరుగని ప్రపంచం చూసాను...
అందంగా చెక్కిన శిల్పాన్ని చూసాను..
మనసులో హాయి నింపే దృశ్యాలను చూసాను...
ఉరుముతూ చల్లబరిచే మేఘాలను చూసాను...
కాని వాస్తవం వెక్కిరిస్తోంది...
కాంక్రీట్ ఎడారిలో ఒంటరిని నేను...
మమత లెరుగని మనుషుల మధ్య
ప్రేమలు లేని హృదయాల సరసన....
అంధకారమైన జీవితంలో గమ్యాన్ని
వెదుకుకుంటూ....
కాగితపు ఆకాశ హర్మ్యాలే ప్రపంచం అనుకుంటూ...
కృతిమ నవ్వులనే పువ్వులు గా భావిస్తూ...
పెట్టు చాయ నే పుట్టు చాయ గా భావిస్తూ..
నా లోకానికి దూరంగా ఈ లోకంలో ఇమడలేక
నాలోనే నేను నాతోనే నేను.....
యుద్ధం చేస్తున్నాను.

మత్స్య విలాపం

అమ్మా.... ఒక ఇల్లుందట
ఇంట్లో అందమైన గూడు
స్వచ్ఛమైన నీరు... ఇక్కడిలా కాదు
అందమైన రాళ్లు.....మైమరిపించేలా
అతిధిలా.....సమయానికి భోజనం
విజేతల... ఆటల్లో కేరింతలు
ఎంత అందమైన జీవితం
ఎంత మధురమైన స్వప్నం
అని కళ్లు మూసినా ఒక క్షణం
ఏమైందో తెలియని అయోమయం.....
కళ్లు తెరిస్తే నా జీవితం.....
చేతులు మారుతున్న విక్రయం
పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్తున్నట్లు....
సముద్రం నుండి గాజుతోట్టి పయనం....
ఆ అందమైన జీవితం....
ఆ మధురమైన స్వప్నం......
చేతికందిన ఆనందం....
ఆ రంగురాళ్ళ గలగలలు...
స్వచ్ఛమైన నీటి బుడగలు....
వేళ కందే విందు బోజనాలు....
ఒక్క క్షణం కన్ను మూస్తే...
నా స్వర్గం చేరసాలయ్యింది.....
ఏది నను ఆట పట్టించే నేస్తం....
ఏది అనునయించే మాతృత్వం....
ఏది భోజనం కోసం వేటలో ఉండే ఉత్సాహం...
రంగు రాళ్ళున్నాయి.... విందు బోజనాలున్నాయి....
కాని స్వాత్రంత్యం ఏది?
స్వచ్ఛమైన నీళ్ళున్నాయి... కృతిమ పూలున్నాయి...
కాని ఆనందం ఏది?
రెండడుగుల చెరసాలలో.... రెండు క్షణాల జీవితం....
ఏమి చెప్పను తల్లీ...
చెరసాలను ఇల్లనుకున్నానని చెప్పనా...

నరకాన్ని స్వర్గమనుకున్నానని చెప్పనా?
నా లోకం వదిలి మరులోకం వెళ్ళాలన్న
ఆశ తో నన్ను నేను వదులు కున్నానని చెప్పనా...
నా లోకం తిరిగి వెళ్ళాలని అశ్రుతప్త
నయనాలతో ఎదురు చూస్తున్నానని చెప్పనా...