Saturday, February 28, 2009

నా ఆశ

ఏమండి రెడ్డిగారు ఏంచేస్తున్నారు????

ఏమయ్యా రాజు బాగున్నావా.....

అయ్యా శాస్త్రిగారు భోజనం అయ్యిందా!!!!!!!

సలాంవాలేకుం సాయిబు గారు...క్యా ఖబర్....

కులంపేర మతంపేర పిలుచుకునే సమాజం..

మానవత కు కడుతోంది శాశ్వతంగా సమాధి..

కులమేదో తెలియనంతవరకు అంతా ఒకే..

కులమేదో తెలిస్తే నీవు నేను ఇండో పాకే

మతమేదో చెప్పకుంటే నీవు నేను భాయి భాయి...

మతమిదని తెలిస్తే ఈ దోస్తీకి బై...బై...

ఎందుకీ దూరం...ఎందుకీ ద్వేషం...

నీ రక్తం నా నెత్తురు ఒకే రంగు..

నీ నీరు నా నేల ఒకే గూటి పక్షులే..

మన రక్తం.. మన గాలికి కులం తెలియనప్పుడు

మన నీరు... మన నేల కు మతం లేనప్పుడు...

ప్రపంచపు సరిహద్దులు ఇంటర్నెట్ చెరిపేస్తే...

మనుషుల మద్యం దూరం సెల్ ఫోన్ దగ్గర చేస్తే...

ఏ కులం గురించి నీ బాధ నేస్తం...

ఏ మతం గురించి నీ యుద్ధం సోదరా...

కులాలకు మతాలకు అర్థం చెరిపేసి

నీ కులం మానవకులమని

నీ మతం విశ్వమతమని

చెప్పేరోజు వస్తుందన్న ఆశ నాది..

రావాలన్న కోరిక నాది...

No comments: