Saturday, February 28, 2009

నాయకుల పర్యటన- ట్రాఫిక్ జామ్ లు

అయ్యగారు వస్తున్నారు అడ్డం జరగమ్మ...

అమ్మగారు వస్తున్నారు... కాస్త ఆగు బాబు...

అయ్యగారి సేవలో యావత్ నగరం

సామాన్య జీవితాలకు కాసేపు విరామం...

ఆఫీసు కు లేట్ ఐతే అయ్యవారి చిరాకు

ఆస్పత్రికి చేరకుంటే ప్రాణానికే ప్రమాదం...

బస్సులన్నీ అమ్మగారి సేవకే...

పోలిసులంతా అయ్యగారి రక్షణకే

ఊపిరిపీల్చాలన్నా అయ్యగారు దాటాలి..

షాపింగ్ కు వెళ్ళాలన్నా అమ్మగారు వెళ్ళాలి...

ట్రాఫిక్ జామ్ లో సామాన్యుడి జీవితం...

ఆడకత్తెర లో పోకచెక్క చందం...

ప్రజాసేవ అంటారు ప్రజలతో సేవ చేయుంచు కుంటారు...

వీళ్ళ చుట్టూ వందమంది పోలిసులు...

వంద మంది ప్రజలకు లేరు ఒక పోలిసు...

రక్షణ అంతా నాయకులకైతే సామాన్యుల గతి ఏమి...

సేవ అంత స్వాములకైతే ప్రజలకు రక్షణ ఏది....

సౌకర్యాలన్నీ దొరలకు కల్పిస్తూ

అసౌకర్యలన్నీ మాకు ప్రసాదం ఇస్తున్నారు...

అసలు ప్రజాసేవ చేస్తున్నది మీరా..

నాయకుల సేవ చేస్తున్నది మేమా...

ఎప్పుడిస్తారు ఈ ట్రాఫిక్ జామ్ లకు విరామం...

ఇస్తారా ఈ సామాన్యుడి జీవితానికి కొంత సమయం...











No comments: