దేశమాత పిలుస్తోంది సోదరా కదలిరా
మాతృభూమి పిలుస్తోంది తమ్ముడా కదలిరా...
తెల్లదొరల బానిసత్వ శృంఖలాలు తెంచుకుంటే
నల్లదొరలు వచ్చారు...
పరుల పీడ వదిలిందంటే మనవాళ్ళే
వంచకులయ్యారు..
దేశమంటే మట్టి కాదన్న గురజాడ ను వెక్కిరిస్తూ
దేశంలోని మట్టినంతా దోచుకుంటున్నారు...
రింగురోడ్ల పేరుతో ఎస్ఈజెడ్ ల సాకుతో
ఐటీ పార్కుల వంకతో భూమి పంచుకుంటున్నారు...
అడవులన్నీ నరికేస్తే...పొలాలన్నీ అమ్మేస్తే...
అయిపోదా ఈ దేశం కాంక్రీట్ అడవి...
మారిపోదా ఈ ఊరొక వేడికొలిమి....
వెచ్చనిరాత్రులను చల్లగా మార్చే శీతలపవనాలేక్కడ...
హాయిగా పరుచుకునే వెన్నెల రాత్రులేక్కడ...
ఎత్తైన మాల్స్ లో ఇరుకైన మల్టిప్లెక్స్లలో
పిల్లల బాల్యం బందీ అవుతోంది..
అపార్ట్ మెంట్ ల లిఫ్ట్ లలో, కార్టూన్ నెట్ వర్క్ లలో
దోబూచులాటలు, అష్టాచెమ్మలు కాలం చేసాయి...
అభివృద్ది మంచిదే, ఎదగడం మంచిదే...
మూల్యం గా జీవితాలు చెల్లించకు...
ప్రకృతి మాత ను బందించాలని చూడకు
వికృతి అయి కాటేస్తుంది....
అడవులను ఊరుగా మార్చబోకు
వనం పామై పగబడుతుంది...
దేశమాత పిలుస్తోంది సోదర కదలిరా...
మాతృభూమి పిలుస్తోంది తమ్ముడా కదలిరా...
మన ప్రకృతి, మన పచ్చదనం కాపాడే
ఉద్యమం మొదలుపెట్టి మేలుచేయ్యి...
మొక్కనాటి, విత్తు వేసి రాబోయే
కాలంలో బాల్యాన్ని కాపాడు....
No comments:
Post a Comment