సుషుప్తం లోంచి చైతన్యం లోకి
బోసి నవ్వులతో ఎన్నో ఆశలతో...
అడుగుపెడ్తోంది ఓ పసిపాప...
అమ్మ పొత్తిళ్ళలో సురక్షితంగా
ప్రపంచంలోని ప్రేమను అనుభవిస్తూ...
చిరునవ్వులు రువ్వుతున్న చిట్టితల్లి
ఎలా చెప్పను నీకు ఈ ప్రపంచం
నీ అంత పవిత్రం కాదని...
ఎలా చెప్పను నీకు ఇక్కడ ద్వేషాలే కాని
ప్రేమలు లేవని...
అందమైన భవిషత్తు కలలుకనే పసిపాప
ఉగ్రవాద భూతం నీపై నుందని గుర్తుంచుకో...
లోకమంతా నీ నవ్వులంత స్వచ్చమనుకునే చిట్టితల్లి..
కుట్రలు, కుతంత్రాలు ఇక్కడున్తాయని గమనించు...
నీ బోసినవ్వు మా మనసులు మార్చాలని...
నీ చిట్టి చేతులు మా చేతలు మార్చాలని
నీతోనైనా ఈ ద్వేషాలు ప్రేమలుగా మారాలని
నీ చిన్నిగుండె తోడుగా నా ప్రార్థన తల్లి
No comments:
Post a Comment