ఒక విప్లవం మొదలవ్వాలి
నిశబ్దంగా... ఉప్పెనలా...
అవినీతికి వ్యతిరేకంగా.... అసమర్ధత కు సవాలుగా...
ఒక విప్లవం మొదలవ్వాలి
నిశబ్దంగా..... ఉప్పెనలా...
ఎన్నాళ్ళు సహించాలి ఈ నిర్లక్ష్యం
ఎన్నాళ్ళు భరించాలి ఈ స్వార్ధం
ప్రపంచాన్ని ఎదిరించే గుండె ధైర్యం నీదైతే...
హిమాలయన్నైనా శాసించే ఆత్మవిశ్వాసం నీదైతే...
అవ్వాలి నీవే ఒక సైనికుడు....రావాలి నీవే ఒక విప్లవకారుడువై ......
సాదించాలి నిశబ్దవిప్లవం...
సముద్రానికైనా ప్రారంభం సిందువుతోనే
ఆకాశహర్మ్యనికైనా పునాది ఒక ఇటుకముక్కతోనే....
మహావ్రుక్షానికైనా బీజం ఒక చిన్నవిత్తులోనే...
ఒంటరి గా భావిస్తే ఒంటరిగా మిగిలిపోతావు...
చేయి చేయి కలిపితే సైన్యం గా మారుతావు...
ఏ ఆయుధం అవసరం లేదు..
ఏ సహాయం తోడు వద్దు...
అనుకున్నది సాధించే కోరిక నీదైతే...
అవుతావు దుర్మార్గం పై నీవే సునామి...
ఈ క్షణం నినదించు నేస్తం.....
అవినీతి ని పటాపంచలు చేస్తానని...
ఈ క్షణం గర్జించు నేస్తం...
దౌర్జన్యాలను సహించబోమని
నా అడుగు లో అడుగు కలుపు మిత్రుడా...
ఒక కొత్త లోకానికి బీజం వేస్తానని...
ఈ నిశబ్ద విప్లవానికి చేయూతనివ్వు సోదరా...
సమసమాజానికి బాటలు వేస్తానని...
No comments:
Post a Comment