ఈ ప్రపంచపు స్లం డాగ్ లు పుడుతూనే ఉంటారు...
వందల్లో వేలలో
సమాజపు మురికి గుంటల్లో పడిలేస్తూ ఉంటారు.
ఒక పూట తిండి కోసం....ఒక రొట్టె ముక్క కోసం.
అలసిపోక ఆశచావక బ్రతకడం కోసం....
కేవలం బ్రతకడం కోసం పుడుతూనే ఉంటారు ప్రతిరోజు.....
ఇది కూడా జీవితమేనా అనిపించే జీవితం లో జీవిస్తూ..
ప్రతి ట్రాఫిక్ జంక్షన్ లో ప్రతి రోజు జీవిస్తూ...మరణిస్తూ...
సూర్యోదయం తో కొత్త జన్మ ఎత్తుతూ... ఆ రోజు జీవనం కోసం...
స్లండాగ్లు పుడుతూనే ఉంటారు...
నాలుగు అడుగుల జాగా లో నాలుగు మెతుకుల వేటలో
ఈ స్లండాగ్లు జీవిస్తూనే ఉంటారు.... సూర్యాస్తమయం తో మరణిస్తారు...
తిరిగి పుట్టడం కోసం...
వేటకుక్కలాంటి ఈ స్లండాగ్ లంటే....
కొందరికి జాలి...కొందరికి వినోదం...
ఈ జీవితాన్ని వినోదం లా తెర పై చూపే
బోయ్లేస్ ను మీరా నాయర్ ల ను
కోటీశ్వరులు చేస్తూ.....
అవార్డు లు రివార్డ్ లతో ప్రఖ్యాతం చేస్తూ....
ముంబై నుండి లాస్ అంజేలేస్ దాకా...
గోల్డెన్ గ్లోబ్ నుండి ఆస్కార్ దాకా....
మిలియన్ ల నుండి బిలియన్ లు సంపద సృష్టిస్తూ
ఈ స్లండాగ్ లు మాత్రం మురికిలో జీవిస్తూనే ఉన్నారు...
మరణిస్తూ ఉంటారు... నాలుగు మెతుకుల కోసం
No comments:
Post a Comment