దేశమాత కుత్తికలో కత్తులు దించి
దేహాన్ని పంచుకోవాలనే దుర్మార్గులు...
భాయి భాయి అనే బంధువులను
శత్రువులుగా మార్చే నీతిలేన్ని నాయకులూ...
భాష ముఖ్యం అన్నారు... ముక్కలుగా చేసారు...
ఉత్తరమా...దక్షిణమా ఏది నీ ఇల్లు అన్నారు...
వైషమ్యాలు రేపారు....
అందరికి స్వంతమైన నీరు నాది అన్నారు...
స్వార్ధం తో ప్రకృతి ని బందించాలని చూసారు...
సోదరుల మధ్య విద్వేషాలు తెచ్చారు...
హాయిగా బ్రతుకుతున్న జీవితాలను
కులం కత్తి తో పొడిచారు...
నా కులం గొప్ప...నీ కులం కాదన్నారు...
స్వార్ధప్రయోజనాలతో సమాజాన్ని చీల్చారు...
రాష్ట్రమాత శరీరాన్ని ఖండాలుగా నరికి
తెలంగాణా నీదని...ఆంధ్రమాత నీదని...
రక్తసిక్తం చేయాలని చూసారు...
మర్చిపోకు... మర్చిపోకు...మర్చిపోకు సోదరా...
ఉత్తరమైనా... దక్షిణమైనా...
ఏ కులం నాదైనా..ఏ మతం వారైనా...
ఏ ప్రాంతం వారైనా.. ఏ రాష్ట్రం వారైనా...
మనమందరం భారతమాత బిడ్డలం...
మనమందరం ఈ పుణ్యభూమి వారసులం..
తన బిడ్డలే విరోధులుగా మారుతుంటే...
చూడలేని దేశమాత రక్తాశ్రువులు కారుస్తుంటే...
ఎక్కడ నుంచి వస్తుంది సుసంపన్నభారతం...
ఎక్కడ నుంచి వస్తుంది సంక్షేమభారతం...
సుజలాం సుఫలాం అని రాగాలే కాదు...
బ్రాత్రుత్వం, సహజీవనం మన మార్గం కావాలి...
కుల మత ప్రాంతాలనే బేధాలు కాదు...
భిన్నత్వం లో ఎకత్వమైన భారతమాత హృదయమేలాలి...
అప్పుడే నిజమోతుంది అఖండభారతం...
No comments:
Post a Comment