ఒక యుద్ధం మొదలైంది....
నాలోనే...నాతోనే...
ఒక అగ్నిగుండం బద్దలైంది...
నన్నే దహించివేస్తూ
ఓ ఆలోచన వెంటాడుతోంది...
జవాబు కోసం...
నేనెవరు...నేనేంటి....
నా ఆశల సౌధం ఇదేనా...
నా మనసును రంజింప చేసే సమీరం ఇదేనా..
నా లక్ష్యం ఏంటి... నేనేం చేస్తున్నాను...
అంతర మెరుగని ప్రపంచం చూసాను...
అందంగా చెక్కిన శిల్పాన్ని చూసాను..
మనసులో హాయి నింపే దృశ్యాలను చూసాను...
ఉరుముతూ చల్లబరిచే మేఘాలను చూసాను...
కాని వాస్తవం వెక్కిరిస్తోంది...
కాంక్రీట్ ఎడారిలో ఒంటరిని నేను...
మమత లెరుగని మనుషుల మధ్య
ప్రేమలు లేని హృదయాల సరసన....
అంధకారమైన జీవితంలో గమ్యాన్ని
వెదుకుకుంటూ....
కాగితపు ఆకాశ హర్మ్యాలే ప్రపంచం అనుకుంటూ...
కృతిమ నవ్వులనే పువ్వులు గా భావిస్తూ...
పెట్టు చాయ నే పుట్టు చాయ గా భావిస్తూ..
నా లోకానికి దూరంగా ఈ లోకంలో ఇమడలేక
నాలోనే నేను నాతోనే నేను.....
యుద్ధం చేస్తున్నాను.
No comments:
Post a Comment